ట్రైలర్ టాక్ – కాన్సెప్ట్ బాగుంది… కానీ…!

2-Memiddaram-Trailerకొరియన్ మూవీ రీమేక్ గా టాలీవుడ్ లో “2 మేమిద్దరం” అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ‘కాన్సెప్ట్’ బేస్ తో తయారైన ఈ సినిమా కధ ఆసక్తికరంగా ఉంది గానీ, దానిని సినిమా నిడివి అంతా ఎంత ఆసక్తికరంగా మలిచారు అనే దానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది.

ఒకళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు మరొకరి జీవితంలో యదార్ధంగా జరిగితే ఎలా ఉంటుంది? అంటే ఒకరి జీవితంలో జరిగిన కధ మరొకరి తెలిసిపోతే, అందులో నుండి లోటుపాటుల నుండి ఎలా తప్పించుకుంటారు? అసలు తప్పించుకోవడం సాధ్యమేనా? అన్న కోణంలో కధ తయారైంది. దీనికి ‘ప్రేమ’ రంగు పూసి సినిమాటిక్ కధను అల్లారు. రెండు నిముషాల నిడివి గల ట్రైలర్ పై మీరు ఓ కన్నేయండి!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories