ఉగాది రోజున వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించిన ఇద్దరు ఎమ్మెల్యేలూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైకాపా శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు, సునీల్ కుమార్ లకు పార్టీ కండువాలు కప్పిన చంద్రబాబు, వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వీరితో పాటు వైకాపాకు చెందిన 25 మంది సర్పంచ్ లు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ తెలుగుదేశంలో చేరారు. అందరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.
తాజా ఎంట్రీతో వైసీపీలో నుండి టిడిపిలోకి చేరిన వారి సంఖ్య రెండెంకెలకు చేరుకుంది. ఇంత జరుగుతున్నా జగన్ తన పాత పాట వీడకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల పులివెందులలో వ్యాఖ్యానించిన జగన్… తదుపరి ఎన్నికలలో విజయం మనదే, నేనే ముఖ్యమంత్రి అవుతానంటూ వర్తమానం వదిలేసి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం జగన్ లోని పరిపక్వతను సూచిస్తుందని విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.



