జస్ట్ ఎ మినిట్… 2019 ఎన్నికల ముందు మోడీ అసలు ట్విస్ట్..?

2000-rupees-demonetization-narendra-modiఇటీవల మోడీ ప్రకటించిన నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమైనప్పటికీ, ఒక ప్రశ్న మాత్రం ప్రధాని చిత్తశుద్ధిని ప్రశ్నించింది. మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన సాధారణ ప్రజానీకం, నిజంగా ఇదే నిర్ణయాన్ని 2019 ఎన్నికల ముందు ప్రకటించినట్లయితే బాగుండేది కదా… అప్పుడు ఓట్లను నోట్లతో కొనే అవకాశం తగ్గేది కదా… అన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఎన్నికల ప్రచారంలో కోట్లకు కోట్లు ఖర్చు తగ్గేదన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి ఆలోచనలు చేసిన వారికే… మోడీ అసలు ట్విస్ట్ ఇవ్వబోతున్నారనే సంకేతాలు అందుతున్నాయి.

అవును… మీరూ ఊహించింది నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 1000 రూపాయల నోటును రద్దు చేసి 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టడం వెనుక కూడా మోడీ మాస్టర్ ప్లాన్ ఉందని, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు కూడా రద్దవుతుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నిజంగా అదే జరిగితే… దేశానికి ఇంతకుమించి మోడీ చేసే మేలు మరొకటి ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

ADVERTISEMENT

1000, 500 రూపాయల నోట్ల రద్దు తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తాత్కాలికంగా అధిగమించేందుకు మాత్రమే 2000 రూపాయల నోటును ప్ర‌భుత్వం తెర‌పైకి తెచ్చిన‌ట్టుగా ఆర్బీఐ వ‌ర్గాల అన‌ధికారిక స‌మాచారం. 2000 రూపాయల నోటు రద్దుపై బ్యాంకింగ్ నిపుణులు సైతం ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వెయ్యికి మించి పెద్ద నోటును అందుబాటులోకి తేవడం వెనుక ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని, చిల్లర కోసం వెంపర్లాడడం కన్నా, ప్రజలకు క్యాష్ లెస్ విధానాలను నిదానంగా అలవాటు చేయాలన్న లక్ష్యమే ఇందులో కనపడుతోందని నిపుణులు చెప్తున్నారు.

ఒక్కసారిగా ‘క్యాష్ లెస్’ విధానమంటే పెద్ద ఎత్తున తిరుగుబాటుతో పాటు, ఇండియాలో అమలు చేయడం అసాధ్యం గనుక, దశల వారీగా ప్రజలను ‘క్యాష్ లెస్’ విధానాలకు అలవాటు చేసే ప్రక్రియలో భాగమే ఇదంతా అని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చని, అన్నింటికీ ప్రజలు మానసికంగా సిద్ధమై ఉండాలన్న సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ మనీ రాయుళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించడమే ప్రధాన లక్ష్యంగా మోడీ అడుగులు వేస్తున్నారని సర్వత్రా వినపడుతోంది. అయితే పేపర్ పై ఉన్న ఈ కార్యాచరణ కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories