251 రూపాయలకే ‘స్మార్ట్ మొబైల్’ అంటూ దేశంలో కలకలం రేపిన రింగింగ్ బెల్స్ కార్యాలయం మూతపడింది. అద్దె చెల్లించని కారణంగా ఈ కార్యాలయం మూత పడినట్టు సమాచారం. కాగా, దీనిపై ఆ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాట్లాడుతూ, తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికీ పారిపోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఫ్రీడమ్ 251 ఫోన్ విషయంలో రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ ను ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మొబైల్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న కస్టమర్ల సొమ్ము విషయంలో ఈడీ పలు ప్రశ్నలు సంధించింది. కాగా, దిగ్గజ మొబైల్ సంస్థలకు సాధ్యం కాని రీతిలో కేవలం 251 రూపాయలకే రింగింగ్ బెల్స్ ఫోన్ అందజేయడంపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపధ్యంలో వినియోగదారుల నుండి ముందుగా తీసుకున్న మొత్తాన్ని కంపెనీ తిరిగి ఇచ్చి వేసిన విషయం తెలిసిందే.
ADVERTISEMENT
ADVERTISEMENT



