చైతూ నుండి అనసూయ మొత్తం రప్పిస్తుందా?

anasuya-naga-chaitanyaగత కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య వివాహంపై బహిరంగంగా ఎప్పుడూ స్పందించింది లేదు. ఏవో ఇటీవల ఓ రెండు ముక్కలు చెప్పడం తప్ప… తన ‘ప్రేమకధ’ గుట్టు విప్పలేదు. అలాగని చైతూ ఒంటరిగా మీడియాకు కూడా దొరికింది లేదు. కానీ, త్వరలో ‘ప్రేమమ్’ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… రాబోయే రోజులన్నీ మీడియా చుట్టూనే తిరగాల్సి ఉంటుంది. నటించిన సినిమా కధ కూడా ‘లవ్ స్టోరీ’ కావడంతో, ఖచ్చితంగా చైతూ ‘ప్రేమకధ’పై ప్రశ్నలు తప్పకవపోవచ్చు.

మరి ఆ తతంగం అంతా జరగడానికి ముందే చైతూ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. వీకెండ్ లో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమంలో ఈ వారం నాగచైతన్య దర్శనమివ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా హాట్ యాంకర్ అనసూయ విడుదల చేసింది. దీంతో ఈ అనసూయ డేట్ లో చైతూ చేత గుట్టంతా విప్పిస్తుందా? అన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో నెలకొంది. చైతూ పెళ్ళయితే సమంతతో అని ఖరారైంది గానీ, ఆ ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది? ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయి? అన్నది మాత్రం బయటకు రాకపోవడంతో, ఈ కార్యక్రమంలో చైతూ సంగతులను వీక్షకులు ఆసక్తిగా గమనించడం తధ్యం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories