మురుగదాస్ – మహేష్ మూవీ అప్ డేట్స్!

mahesh-babu-muragadoss-movie-updatesమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ మరికొద్ది గంటల్లో విడుదల అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ విషయంలో నెలకొన్న గందరగోళానికి ‘శుభంకార్డు’ పడుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి గానీ, దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరి నుండి దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.

ప్రిన్స్ ఏమో స్విస్ లో ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తుండగా, మిగతా యూనిట్ సభ్యులు కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోయారు. అహ్మదాబాద్ షూటింగ్ డిసెంబర్ 23వ తేదీతో ముగియగా, తదుపరి షెడ్యూల్ ను జనవరి 7వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. ఈ సినిమాను ‘బాహుబలి’ కంటే ముందుగా విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం జూన్ కు షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

తమిళ, తెలుగు భాషల్లో నిర్మాణం జరుపుకోనుండడం ఒక కారణమైతే, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ముందుగా రెండు నెలల సమయం అనుకోవడంతో, షూటింగ్ రెండు నెలలు ఆలస్యం కావడంతో, ‘వాయిదా’ అనివార్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని సినీ జనాల టాక్. లేటెస్ట్ న్యూస్ ప్రకారం జూన్ 23వ తేదీన ఈ సినిమాను రెండు భాషల్లోనూ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories