ఇప్పటివరకు అధికారికంగా ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయని మహేష్ – మురుగదాస్ కాంభినేషన్ లోని సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాకు చెప్పండి చాలు… అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎంతగా గగ్గోలు పెడుతున్నా, సినిమాపై ఒక్క విషయం కూడా చెప్పని చిత్ర యూనిట్ సభ్యులలో తొలిసారిగా దర్శకుడు మురుగదాస్ చేసిన ఓ చిన్న ట్వీట్ అంచనాలను పెంచేసింది.
‘మురుగదాస్ కు మరియు ఇతర యూనిట్ సభ్యులకు కొత్త ఏడాది శుభాకాంక్షలు’ చెప్తూ ప్రిన్స్ చేసిన ట్వీట్ గా రిప్లై ఇచ్చిన దర్శకుడు… ‘కృతజ్ఞతలు తెలుపుతూ… మహేష్ కు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, బ్లాక్ బస్టర్ ఆన్ ది వే…’ అని చెప్పడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని భావించినప్పటికీ, అది రాకపోవడంతో నిరాశతో అభిమానులకు కొండంత ఊపు తెప్పించింది మురుగదాస్ ట్వీట్.
ఈ ట్వీట్ మురుగదాస్ ఎంత నమ్మకంతో చేసి ఉంటాడో అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో ‘మహేష్ 23’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ట్వీట్ ప్రభావమే ఇంత ఉంటే, ఫస్ట్ లుక్, టీజర్ కూడా బయటకు వస్తే సినిమా స్వరూపం మారిపోతుందేమో చూడాలి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత సినిమా గురించి మురుగదాస్ చేసిన తొలి ట్వీటే సంచలనాత్మకంగా మారింది.
"Thank you so much sir… Happy new year.. BLOCKBUSTER on the way" #ARMurugadoss to reply to #Mahesh babu
— Srikanth PochirajU (@SrikantPochiraj) January 1, 2017



