‘ది మోస్ట్ అవైటేడ్ మూవీ’ ట్రైలర్ వచ్చేసింది… టాక్ ఏంటి..?

dangal-trailer‘మిస్టర్ పర్ఫెక్ట్’ అంటే ఒక్క అమీర్ ఖాన్ తప్ప మరొక హీరో ఆలోచనలోకి కూడా రారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తను ఎంచుకునే కధలు, వాటికి ప్రాణం పోసే తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే అనేటంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపే అమీర్ ఖాన్ నటించిన “దంగాల్” మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘పీకే’ తర్వాత అమీర్ నటిస్తున్న సినిమా కావడం మరియు ఒక నిజ జీవితగాధతో తెరకేక్కుతుండడంతో ‘దంగాల్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ADVERTISEMENT

అయితే విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ ఆ అంచనాలను అందుకుందా? అంటే ఖచ్చితంగా అనే చెప్పాలి. ట్రైలర్ నిడివి మూడు నిముషాల పాటు ఉండడంతో, కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించినా… ఈ ట్రైలర్ తోనే కధను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళేలా కట్ చేయడం విశేషం. తానూ దేశానికి ఒక గోల్డ్ మెడల్ సాధించాలని అనుకున్నప్పటికీ, అది నెరవేరని ఒక రెజ్లర్, తన కొడుకు ద్వారా తన కలను నెరవేర్చాలనుకుంటాడు. అయితే, అతనికి ఇద్దరూ పాపలే జన్మించడం, ఆ తర్వాత వారిని ఎలా రెజ్లర్లుగా తీర్చిదిద్దారు అనేది ప్రధాన ఇతివృత్తంగా సాగింది.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ లో గొప్పగా చెప్పుకునే సన్నివేశాలు లేకపోయినా… ఏమోషన్స్ క్యారీ చేయడంలో సక్సెస్ సాధించింది. చివర్లో రెజ్లర్ గా అమీర్ ఖాన్ బరిలోకి దిగడం కొసమెరుపుగా ఉన్నా… దాని వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటన్నది సస్పెన్స్ గా వదిలారు. డిసెంబర్ 23వ తేదీన క్రిస్ట్ మస్, నూతన సంవత్సర కానుకగా ఈ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories