డిఫరెంట్ సినిమాలను చేస్తూ హీరోగా తనకంటూ ఓ ఫేం తెచ్చుకుంటోన్న శ్రీవిష్ణు తాజాగా చేసిన చిత్రం “నీది నాది ఒకే కథ.” గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రమోషన్ లో భాగంగా తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏందిరా ఈ జనాల గోల’ అంటూ లైఫ్ లో సెటిల్ కావాల్సిన కుర్రోడు పాడుకునే పాట చాలా క్యాచీగా ఉంది.
కానీ నయా ట్రెండ్ కు అనుగుణంగా శ్యామ్ కాసర్ల అందించిన లిరిక్స్ లో ‘బూతు’ పదాలు కూడా వినిపించడం విశేషం. సినిమాకు సెన్సార్ ఉంటుంది గనుక ఈ పాటలో వినిపించిన ‘చావదెXX’ అనే పదం రేపు సిల్వర్ స్క్రీన్ పై వినిపించకపోవచ్చు. అలాగే ‘fuXX’ అంటూ వినిపించిన మరో పదం కూడా సెన్సార్ కు గురి అవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు.
పాట అయితే వినసొంపుగా ఉంది గానీ, మధ్యలో ఈ బూతులు కాస్త కర్ణకఠోరంగా ఉన్నాయి. మొదటిసారి విన్నపుడు అయితే, మనం విన్నది కరెక్టేనా… అని కాస్త బ్యాక్ కు వెళ్లి మరొకసారి చెక్ చేసుకుని… ‘అరె… ఇలా బూతు పదాన్ని పెట్టేసారేంటి…’ అనుకోవాల్సి వస్తుంది. బహుశా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా అలా రిలీజ్ చేసారో… లేక కధ డిమాండ్ చేయబట్టి ఈ బూతులు పెట్టారో..!



