విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడితో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అయితే ఈ సందర్భంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఇప్పటికిప్పుడు జరిగినది కాదని, ముందే ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడిగా…. “ఆపరేషన్ గరుడ”లో హీరో శివాజీ రెండు నెలల క్రితమే చెప్పడం విశేషం.
[m9ad]
రాష్ట్రంలో ఉన్న ముగ్గురు నేతలలో కొత్తగా వచ్చిన నాయకుడిని పక్కనపెడితే, ఓ ప్రధాన నేతపై ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుందని, దాంతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతాయని, ఇదంతా అధికార పక్షంపై రుద్దడానికి స్కెచ్ జరుగుతుందని చెప్పిన వీడియో, నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే ఇది జరుగుతోందన్న భావన ప్రజల్లోకి వెళుతోంది.
ఇదిలా ఉంటే జగన్ పై జరిగిన దాడిని బిజెపి నేత జీవీఎల్ నరసింహారావు ఖండించారు. అలాగే పలువురు బిజెపి కేంద్రమంత్రులు కూడా రంగంలోకి దిగి ఈ ఘటనను ఖండించారు. ఇక సదరు వీడియోలో చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ ప్రకారం అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి త్వరలో కోర్టుల నుండి ఊరట లభించే సమాచారం దక్కనుండాలి.



