మలయాళ ముద్దుగుమ్మ భావనపై జరిగిన లైంగిక దాడి తర్వాత చిత్ర నిర్మాత నవీన్ తో భావన నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. అలాగే పెళ్లి ముహుర్తాలు కూడా పెట్టుకుని అక్టోబర్ లో వివాహం అనుకున్న తరుణంలో… సదరు సమయానికి వివాహం జరగకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా సెలబ్రిటీల వివాహాలలో నిలకడ లోపించడంతో అసలు భావన – నవీన్ ల పరిణయం డోలాయమానంలో పడినట్లయ్యింది.
కానీ అలాంటి వాటికి తావు లేకుండా మరోసారి భావన పెళ్లి ముహూర్తాన్ని ప్రకటించారు. 2018 జనవరి 22వ తేదీన కేవలం సమీప బంధువుల నడుమ వీరిద్దరి వివాహం జరగనుందనేది లేటెస్ట్ న్యూస్. ఈ ఏడాది మార్చి 9వ తేదీన జరిగిన నిశ్చితార్ధం కూడా సినీ, రాజకీయ ప్రముఖులకు దూరంగా కేవలం సన్నిహితులు, బంధువుల నడుమ మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి కూడా అదే రూట్ లో పయనిస్తోందన్న మాట.
ADVERTISEMENT
ADVERTISEMENT



