లాక్ డౌన్ తరువాత మొదటి టాలీవుడ్ సినిమా ఇదే

will allu arjun readh 100 crore club with Ala Vaikuntapuramlooస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క బ్లాక్ బస్టర్ హిట్, అల వైకుంఠపురంలో ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్ తరువాత థియేటర్లలోకి వచ్చిన మొట్ట మొదటి చిత్రం. ఈ చిత్రం ఈ రోజు నుండి చోదవరం పూర్ణ థియేటర్ (వైజాగ్) లో విడుదలైంది. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

కేంద్ర ప్రభుత్వం థియేటర్లను తెరవడానికి అనుమతించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా థియేటర్లు 50% ఆక్యుపెన్సీ నిబంధనతో మరియు కొత్త విడుదలలు లేని కారణంగా మూసి ఉంచాడనికే నిర్ణయించుకున్నాయి. మరోవైపు… తెలంగాణలో థియేటర్లను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు.

ADVERTISEMENT

లాక్ డౌన్ కు ముందు తెలుగు చిత్ర పరిశ్రమకు అల వైకుంఠపురంలో చివరి హిట్. బాహుబలి సిరీస్ మరియు సాహో తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది అతిపెద్ద హిట్. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో పివిఆర్ చైన్ కొన్ని ప్రయోగాత్మక స్క్రీనింగ్‌లను చేస్తుంది.

వారి సిబ్బందినే ప్రేక్షకులుగా చేసి తిరిగి ప్రారంభించిన తర్వాత అమలు చేయబోయే భద్రతా చర్యలను చెక్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్లు వచ్చే వారం తిరిగి ఓపెన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు రిలీజైన సినిమాలను తిరిగి ప్రదర్శించాలని నిర్ణయించారు.

ADVERTISEMENT
Latest Stories