ఫ్యాన్స్ ను ఊరిస్తోన్న పవన్ కళ్యాణ్!

Pawan-Kalyan-Agnyaathavaasi-Latest-Stillsత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అజ్ఞాతవాసి” సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న వైనం విదితమే. జనవరి 10వ తేదీ ఎప్పుడు వస్తుందా..? అని వేచిచూస్తున్న ఫ్యాన్స్ ను ఊరించేలా “అజ్ఞాతవాసి” లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవును… పవన్ కళ్యాణ్ ఇస్తోన్న ఫోజులకు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

యోగా మాదిరి ఆసనం వేసుకుని ఉన్న పవన్ కళ్యాణ్ స్టిల్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సన్నివేశం వచ్చినపుడు మాస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఊగిపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో మొత్తం 7 ఫైటింగ్ సన్నివేశాలు ఉండగా, అందులో నాలుగు పెద్దవి, మూడు చిన్నవిగా ఉన్నాయి. ఈ ఏడు పోరాట సన్నివేశాలలో ఏదొక ఫైట్ సీన్ లోనే విక్టరీ వెంకటేష్ కూడా ప్రత్యక్షం కానున్నాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories