“అజ్ఞాతవాసి” అప్ డేట్స్… ఒక్కరోజు ఆలస్యం..!

Agnyaathavaasi Audio Launch Updatesపవర్ స్టార్ పవన్ కల్యాణ్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అజ్ఞాతవాసి’ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది. ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే సమయం కోసం వాళ్లంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ అనూహ్యమైన స్థాయిలో ఆకట్టుకోవడమే అందుకు కారణం.

జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 29వ తేదీన సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లాల్సి వుంది. అయితే కొన్ని కారణాల వలన మరుసటి రోజుకు వాయిదాపడి, ఈ నెల 30వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని ట్రేడ్ టాక్. అయితే సెన్సార్ లో ఉన్న మార్పు రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రభావితం చేయబోదు.

ADVERTISEMENT

పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, సీనియర్ కథానాయికలు ఖుష్బూ .. ఇంద్రజ కీలకమైన పాత్రలను పోషించారు. పవన్ కల్యాణ్ కి ఇది 25వ సినిమా కావడం .. త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమా కావడంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

ADVERTISEMENT
Latest Stories