పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అజ్ఞాతవాసి” సినిమా ప్రీమియర్ షో టికెట్స్ ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ..! ఏంటి… ప్రీమియర్ షోల ద్వారానే మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టాలని భావిస్తున్న పవన్ సినిమాకు టికెట్లు ఫ్రీగా ఎలా లభిస్తాయండి అనుకుంటున్నారా? ‘ఫ్రీ’ అన్న నిజమే గానీ, యధావిధి ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ కూడా ఉంటాయి కదా! ఇంతకీ ఆ నిబంధనలు ఏమిటంటే… డిసెంబర్ 31వ తేదీన ‘జల్సా’ చేయడమే.
“జల్సా 2018” పేరుతో ఓ ఈవెంట్ సంస్థ ఏర్పాటు చేసిన పార్టీ కోసం పాస్ లను కొనుగోలు చేసిన వారికి, జనవరి 9వ తేదీన అమెరికాలో వేయబోయే ప్రీమియర్ షోకు టికెట్లను ఉచితంగా ఇస్తామని సదరు సంస్థ ప్రకటించడం విశేషం. టెక్సాస్ లోని ఇర్వింగ్ బిజినెస్ స్టూడియోస్ వద్ద ఈ న్యూ ఇయర్ పార్టీ జరగనుంది. ఎంట్రీ కోసం ఒక్కో ఫ్యామిలీకి 145 డాలర్లు నిర్ణయించగా, ఇవి కొనుగోలు చేసిన వారికి “అజ్ఞాతవాసి” టికెట్ ఫ్రీ.
ఫ్యామిలీస్ తో పాటు బ్యాచిలర్స్ కు కూడా సపరేట్ సెక్షన్ ఉందిలేండి. స్వామి కార్యం, స్వకార్యం అవ్వాలనే ఉద్దేశంతో “అజ్ఞాతవాసి”ని చూపించి సదరు సంస్థలు బిజినెస్ చేసుకుంటున్నాయి. ఎంతైనా పవర్ స్టార్ సినిమా కదా… ఆ మాత్రం ఉంటుందిలేండి. విడుదలకు ముందే ఇంత హంగామా చేస్తున్న ‘అజ్ఞాతవాసి’ విడుదలైన తర్వాత ఎంతటి చరిత్రను సృష్టిస్తాడోనని టాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



