‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అజ్ఞాతవాసి” సినిమా మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో 10వ తేదీ వేకువజాము నుండే, అనగా 9న అర్ధరాత్రి 12 గంటలు దాటిన సమయం నుండి షోలు వేసుకోవడానికి అనుమతులు లభించడంతో, పవర్ స్టార్ అభిమానుల హంగామా ధియేటర్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇదే సమయంలో అమెరికాలో ప్రీమియర్ షోలు పడనుండడంతో ఈ సారి అమెరికా రిపోర్ట్ తో ఏపీ రిపోర్ట్ కూడా ఒకేసారి వెలువడనుంది.
మొదటి రోజు నాడు ఓవరాల్ గా “బాహుబలి 2” రికార్డుల చేధన దిశగా సాగుతున్న పయనంలో…. ముందుగా యుఎస్ఎలో అయితే ‘నాన్ బాహుబలి’ రికార్డు కొట్టడం లాంచనమే అని చెప్పవచ్చు. ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దిశగా ప్రీమియర్ షో సంఖ్య చేరుకోగా, షోలు మొదలయ్యే సమయానికి ఈ సంఖ్య 2 మిలియన్ కు చేరుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ హంగామాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా భారీ క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో ప్రీమియర్ షోలకు హీనపక్షంగా 1.5 మిలియన్ డాలర్స్ వసూలు అయినా, ఫస్ట్ డే కలెక్షన్స్ మరో 1.5 మిలియన్ డాలర్స్ అయినా వసూలు చేస్తుందన్న అంచనాలు ట్రేడ్ పండితులు వ్యక్తపరుస్తున్నారు. అంటే మొత్తమ్మీద ఫస్ట్ డే నాడు 3 మిలియన్ డాలర్స్ తో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డును కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఆ పైన సినిమాకు పాజిటివ్ లేక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే గనుక, ఫైనల్ గా ఎన్ని మిలియన్ డాలర్స్ వద్ద ల్యాండ్ అవుతారనే దానికి నిదర్శనంగా పవర్ స్టార్ క్రేజ్ ను పేర్కొనవచ్చు.



