పవన్ – వెంకీల ఫైటింగ్!

Small-Actor-Slips-Big-Secret-About-Agnyaathavaasi‘గోపాల గోపాల’ సినిమాలో పవన్… వెంకటేశ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోను పవన్ తో కలిసి వెంకటేశ్ కనిపించనున్నారనే వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో వెంకటేశ్ 4 నిమిషాల సేపు మాత్రమే కనిపిస్తారనేది ఇండస్ట్రీ టాక్. దాంతో ఆయన పాత్ర ఎలా ఎంట్రీ ఇస్తుందనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ మేనమామగా ఓ కామెడీ సీన్ లో వెంకటేశ్ కనిపించనున్నారనే వార్త నిన్నమొన్నటి వరకూ వినిపించింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వెంకటేశ్ కనిపించేది కామెడీ సీన్లో కాదట… ఓ యాక్షన్ సీన్లో అంటున్నారు. పవన్ తో పాటు వెంకటేశ్ కనిపించే ఈ ఫైట్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ సీన్ సీరియస్ గా… పవర్ ఫుల్ గా ఉంటుందా? లేదంటే కామెడీ టచ్ తో ఉంటుందా? అనేది జనవరి 10న తేలనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories