అజ్ఞాతవాసి… అనుకున్నదొక్కటి… అయ్యిందొక్కటి…!

Agnyaathavaasi-Censor-Inside-Report,-Agnathavasi-Censor‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అజ్ఞాతవాసి” విడుదలకు కావాల్సిన క్లియరెన్స్ లన్నీ పూర్తి చేసుకుంది. దీంతో జనవరి 9వ తేదీన యుఎస్ ప్రీమియర్ షోలతో ప్రారంభం కానున్న హవాను, 10వ తేదీన లోకల్ ప్రేక్షకులు కొనసాగించనున్నారు. అయితే త్రివిక్రమ్ సినిమాలంటే సాధారణంగా సెన్సార్ బోర్డు నుండి ‘క్లీన్ యు’ సర్టిఫికేట్స్ లభిస్తుంటాయి. పవన్ – త్రివిక్రమ్ ల గత చిత్రం “అత్తారింటికి దారేది” కూడా ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ నే పొందింది. కానీ “అజ్ఞాతవాసి” మాత్రం అందుకు విరుద్ధంగా ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది.

నిజానికి ఈ సినిమాకు కూడా ‘క్లీన్ యు’ లభిస్తుందని ముందుగా అంచనా వేసారు. కానీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో, ‘క్లీన్ యు’ కాకుండా, ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను మంజూరు చేసింది. అయితే ఈ సర్టిఫికేట్స్ సినిమా ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపవు గానీ, ‘క్లీన్ యు’ అయితే పూర్తి ఫ్యామిలీతో కలిసి సినిమా వీక్షించడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. ఈ ప్రభావం ఒక్క మల్టీప్లెక్స్ లకు మాత్రమే పరిమితం కావడంతో, చిత్ర యూనిట్ తో పాటు పవన్ అభిమానులు పెద్దగా చింతించాల్సిన పనిలేదు.

ADVERTISEMENT

అయినా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటే ఫ్యాన్స్ కు పండగే కదా! ఎందుకంటే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడంలో దర్శకుడు త్రివిక్రమ్ శైలే వేరు. మామూలు సన్నివేశాలలో హాస్యాన్ని పండించడం రొటీన్ విషయం అయితే, ఫైటింగ్ సీన్స్ లో కూడా హాస్యాన్ని జోడించడం ఒక్క త్రివిక్రమ్ కు మాత్రమే సాధ్యమైన విషయం. దీంతో “అజ్ఞాతవాసి” సినిమాకు ‘యు/ఎ’ రేటింగ్ లభించడం ఒక రకంగా అభిమానులకు పండగ లాంటి వార్తే!

ADVERTISEMENT
Latest Stories