నోటి దూలకు క్షమాపణలు చెప్పిన నేత..!

Trisha AIADMK Leader AV Raju

తన పై మనసు పారేసుకున్న ఒక ఎమ్మెల్యేతో రోజు గడపడానికి 25 లక్షలు తీసుకుంది త్రిష అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత రాజు పై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు త్రిష. తన పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజు పై పరువు నష్ట దావా వేశారు త్రిష.

భారీ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాలంటూ సదరు రాజకీయ నాయుడుకి లీగల్ నోటీసులు పంపారు త్రిష. అలాగే త్రిష పై ఇటువంటి కాంట్రావెర్సీ కామెంట్స్ చేసిన రాజు పై అటు సినీ పరిశ్రమ నుంచి, ఇటు రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. హీరో విశాల్ స్పందిస్తూ నెగటివ్ ప్రచారంతో పాపులర్ అవ్వడానికి ఇటువంటి నీచానికి దిగజారుతారు కొందరు వ్యక్తులు అంటూ రాజు ని ఉద్దేశించి విమర్శలు చేసారు.

ADVERTISEMENT

ఇక ఇంటా బయటా రాజు చుట్టూ విమర్శల మోత మోగడం, అటు న్యాయపరంగాను చిక్కులు ఎదురవడంతో తన నోటిదూల వ్యాఖ్యలకు నటి త్రిషకు క్షమాపణలు చెప్పారు రాజు. సినీ రంగానికి, రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తుల పై సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక రూమర్ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది.

అయితే బాధ్యత కలిగిన పోసిషన్ లో ఒక ఎమ్మెల్యే గా ఉంటూ ఒక నటిని ఉద్దేశించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇది ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేయగలదు. ఆడవారి పై కనీస గౌరవం కానీ సంస్కారం కాని లేని వ్యక్తిగా తమ ప్రత్యర్థి పార్టీల నేతలు రాజుని చిత్రీకరించే అవకాశం లేకపోలేదు.

చేసిన పిచ్చి వ్యాఖ్యలకు అన్ని రకాలుగా ఇరకాటంలో పడ్డ ఏవీ రాజు దిగొచ్చి త్రిషకు క్షమాపణలు చెపుతూ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదంటు, తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ కాస్త కవర్ చేయడానికి ప్రయత్నించి మరోసారి నవ్వుల పాలయ్యారు. చేసింది తప్పని తెలిసినప్పుడు ఇలా కవరింగ్ మాటలు మాట్లాడకూడదు కదా..!

మొన్న తన సహా నటుడు మన్సూర్ అలీఖాన్, నేడు ఒక రాజకీయ నాయకుడు ఏవీ రాజు ఇద్దరు త్రిష పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తిరిగి త్రిషను క్షమాపణలు అడిగినవారే. అయితే మన్సూర్ క్షమాపణలు అంగీకరించిన త్రిష రాజు క్షమాపణలు అంగీకరిస్తుందా..? నోరుంది కదా అని నోటికి వచ్చిందల్లా మాట్లాడం…ఆతరువాత తప్పయింది… క్షమించండి….నా ఉద్దేశం అది కాదు అని కళ్ళబుల్లి కబుర్లు చెపితే చేసిన తప్పు ఒప్పవుతుందా..? బాధితులకి పోయిన పరువు తిరిగొస్తుందా..?

ADVERTISEMENT
Latest Stories