తమిళంలో అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతకాలంగా ఆయన వరుస విజయాలను సాధిస్తూ వస్తుండటం విశేషం. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో కూడినవే కావడం గమనించదగిన విషయం. శివ దర్శకత్వంలో అజిత్ చేసిన ‘వీరమ్’ .. ‘వేదాళం’ .. ‘వివేగం’ చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తూ, అజిత్ కెరియర్లోనే ప్రత్యేక స్థానాల్లో నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి అభిమానులను పలకరించడానికి రెడీ అవుతోంది.
వీరి కాంబోలో ‘వి’ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్… సక్సెస్ లను తెస్తుండటంతో, ఈ దర్శకుడు… అజిత్ ఇద్దరూ కూడా మళ్లీ అదే సెంటిమెంట్ ను పాటిస్తూ ‘విశ్వాసం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఈ సెంటిమెంట్ కలిసొచ్చి ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడం ఖాయమనే మాట కోలీవుడ్లో వినిపిస్తోంది. అజిత్ కి ఇది 58వ సినిమా కాగా, ఇందులో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి మరి.
ADVERTISEMENT
ADVERTISEMENT



