‘మా అన్నయ్య’ స్వచ్చమైన లవర్ – అఖిల్!

akhil-naga-chaitanya-loveఅక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ప్రేమమ్’ సినిమా ఆడియో వైభవంగా విడుదల అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వేదికపై ‘ప్రేమమ్’ ధియేటిరికల్ ట్రైలర్ ను అఖిల్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత తన అభిప్రాయం చెప్పుకొచ్చిన అఖిల్… ‘ఈ ట్రైలర్లు, వీడియోలు అన్నీ చూస్తుంటే ఈ ప్రపంచంలో తన అన్నయ్య అంత స్వచ్చమైన లవర్ అనిపిస్తుందని’ కుండబద్దలు కొట్టారు.

ADVERTISEMENT

అంతేకాదు, ఇక నేను ఆ జోనర్ లో పోటీపడను, నిన్ను ఫాలో అయిపోతాను… అంటూ చెప్పడం… బహుశా ‘ప్రేమమ్’ సినిమా ట్రైలర్ గురించే కావచ్చు గానీ, ప్రస్తుతం ‘చైతన్య – సమంత’ రిలేషన్ షిప్ హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్న నేపధ్యంలో… అఖిల్ వ్యాఖ్యలు ‘రీల్’ కంటే కూడా ‘రియల్’ లైఫ్ కే ఎక్కువగా తాకింది. అఖిల్ అన్నట్లు… అన్నయ్యను నిజంగానే ఫాలో అవుతూ అఖిల్ కూడా ప్రేమ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories