“హలో” టాక్ ఏంటి?

Akhil Akkineni Hello Movie Public Talk.jpgమొదటి సినిమా “అఖిల్” దారుణ పరాజయం కావడంతో, రెండవ సినిమా “హలో” విజయం అనేది కెరీర్ కు చాలా కీలకం కానుంది. మరి ఆ సక్సెస్ ను అఖిల్ అందుకున్నాడా? ప్రేక్షకుల శభాష్ అనిపించుకున్నారా? అంటే… తొలి సినిమాతో పోలిస్తే అన్ని విభాగాలలో అఖిల్ మెరుగైన ప్రదర్శనను ఇచ్చారనే ‘సింగిల్ టాక్’ సర్వత్రా వినపడుతోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా ఫైట్స్ అయితే సినిమాలో చాలా కొత్తగా ఉన్నాయన్న టాక్ తెచ్చుకున్నాయి. ఇది అఖిల్ ను బాగా ఎలివేట్ చేసేలా తెరకెక్కించడం ప్లస్ పాయింట్. ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా స్క్రీన్ ప్లే బేస్ తో ఆహ్లాదకరంగా సాగిపోయే ఫస్టాఫ్ లో అఖిల్ బాగానే మార్కులు సంపాదించాడు. అఖిల్ తన సోల్ మేట్ ఫోన్ నెంబర్ ను సంపాదించడమే క్లుప్తంగా సినిమా కధ.

అయితే దానిని సాధించే విషయంలో ఇంకాస్త ఆసక్తిగా మలిచి ఉంటే ఇంకా బాగుండేదన్న టాక్ వినపడుతున్నప్పటికీ… ఓవరాల్ గా “హలో” ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే బాక్సాఫీస్ పరంగా ఏ రేంజ్ లో ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. ఇదే అఖిల్ ‘స్టార్ డం’ను డిసైడ్ చేయనుంది.

ADVERTISEMENT
Latest Stories