బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా అక్కినేని అఖిల్!

akhil-akkineni-topic-of-bollywood-raveer‘అఖిల్’ ద్వారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్, ఇప్పటివరకు రెండో సినిమాను ప్రారంభించింది లేదు. అయితే మరో పక్కన కార్పొరేట్ యాడ్ లను మాత్రం చేస్తూనే ఉంటున్నాడు. ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్న అఖిల్, ప్రముఖ బాలీవుడ్ హీరోలతో సఖ్యతగా ఉండడం టాలీవుడ్, బాలీవుడ్ లలో హాట్ టాపిక్ గా మారింది.

అవును… ఇటీవలే బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో సెల్ఫీలు దిగిన అఖిల్, తాజాగా మరో టాప్ హీరో రన్వీర్ సింగ్ తో కలిసి ఫోటోలు దిగడం విశేషం. బాలీవుడ్ – టాలీవుడ్ హీరోలకు పరిచయాలు ఉన్న మాట వాస్తవమే గానీ, అఖిల్ రేంజ్ లో కలిసిమెలిసి ఉండడం మాత్రం చాలా అరుదు. నిజానికి బాలీవుడ్ లో బాగా సుపరిచితమైన మహేష్ బాబుతో కూడా ఏ హీరోలు ఇంతగా కలివిడిగా లేరు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories