అఖిల్ అక్కినేని మొదటి సినిమా ‘అఖిల్ – ది పవర్ అఫ్ జువా’ నిర్మించాడు హీరో నితిన్. ఆ సినిమా ఘోరమైన ప్లాప్ గా నిలిచింది. మొదటి సినిమాతో హిట్ కొట్టాలి అన్న అఖిల్ ఆరాటం నీరుగార్చింది. అలాగే నితిన్ కి కూడా భారీగా లాస్లు మిగిల్చింది. అయితే తన ఫ్రెండ్ కి వచ్చిన నష్టాలు పూడ్చడానికి అఖిల్ అతనికి మరో అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్నారు అఖిల్. ఈ సినిమా తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించబోతున్నారట. ఈ సినిమాను హీరో నితిన్ నిర్మించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే నితిన్ ప్లాపులలో ఉన్నాడు.
చాలా ప్రయత్నాల తరువాత భీష్మతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. అలాగే తన ఫ్రెండ్ అఖిల్ కూడా హిట్ ఇవ్వగలను అనే నమ్మకంతో ఉన్నాడు. ఇక సురేందర్‌రెడ్డి విషయానికి వస్తే… తన చివరి సినిమా మెగాస్టార్ చిరంజీవి సైరా. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా కమర్షియల్ గా సంతృప్తి పరచలేదు.
దీనితో ఆ డైరెక్టర్ కూడా అఖిల్ తో పెద్ద హిట్ కొట్టాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నాక కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఈ సమ్మర్ లో సినిమాని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడితేనే అది సాధ్యపడుతుంది.





