దాదాపు “అఖిల్” సినిమా ప్రీ ప్రొడక్షన్ ముందు వరకు వినిపించిన మాటలు ఇవి. మెగా ఫ్యామిలీ నుండి నిహారిక, అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ ఒకేసారి వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అవేమీ కార్యరూపం దాల్చుకోలేదు. అఖిల్ తన సొంత పేరునే సినిమాగా మలిచి దెబ్బ తినగా, నాగబాబు కూతురుగా బుల్లితెరకు పరిచయమైన నిహారిక, మొదటి సినిమాపై ఎటువంటి అంచనాలు లేకుండా ఉండడం కోసం స్టార్ స్టేటస్ లేని నాగశౌర్య పక్కన హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
అయితే తాజాగా మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించానున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అఖిల్’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడడంతో, ఈ సారి ఎటువంటి తప్పులు చేయకూడదని తదుపరి చిత్రం కోసం (సెంటిమెంట్ పరంగా కూడా) అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అఖిల్ రెండవ సినిమాపై ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఆ సినిమాలో హీరోయిన్ గా నిహరికకు అవకాశం దక్కవచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలా అయితే అక్కినేని సినిమాకు మెగా ఫ్యాన్స్ సందడి కూడా తోడు అవుతుందని అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఇక, సెంటిమెంట్ విషయానికి వస్తే… “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా ద్వారా కూడా మెగా, అక్కినేని కుటుంబ వారసులు ఒకేసారి ఎంట్రీ ఇచ్చి భంగపడడంతో, అఖిల్ తొలి సినిమాకు ‘మెగా – అక్కినేని’ కాంభినేషన్ ను పక్కన పెట్టారని, అందుకే రెండవ సినిమాకు సిద్ధమవుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత ఉందో బహుశా మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోవచ్చు.





