మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోయిన ఎన్నికలలో కేవలం 12 ఓట్లతో గెలిచారు. అయినప్పటికీ నియోజకవర్గం పని కంటే కోర్టు కేసులు వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలా అనేది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఏపీ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్ ని టార్గెట్ చేశారు. ఆయన హైదరాబాద్ ఇంటి మీద హై కోర్టులో పిటీషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న… ఆర్పీ ఠాకూర్ ఇంటి నిర్మాణం అక్రమంగా ఉందట.
ఒకటో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వెళ్లడానికి.. ఓ బ్రిడ్జిలాంటిది నిర్మించారట. అది రూల్స్ ని అతిక్రమించినట్టే అంట. అంతే కాకుండా.. ఆయన ఇంటి పక్కన ఉన్న పార్కును కూడా ఆక్రమించారట. దీనిపై.. జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదట. కావున ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారి మీదైనా చర్యలు తీసుకోవాల్సిందే. కాకపోతే అసలు హైదరాబాద్ లో ఉన్న ఇంటికి… మంగళగిరి ఎమ్మెల్యేకి సంబంధమేమిటి?
ఏపీ పోలీసులపై నమ్మకం లేదని తరచు చెప్పే వైకాపా నేతలు… ఈ మధ్యనే డీస్పీ నియామకాలపై కుల ముద్ర వెయ్యడానికి ప్రయత్నించి విఫలం అయ్యింది. ఠాకూర్ తో సహా ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి వీళ్ళని తప్పిస్తే గానీ ఎన్నికలు నిస్పాక్షికంగా జరగవని కంప్లయింట్ చేశారు. దీని వెనుక కేవలం ఏపీ డీజీపీని బ్లాక్‌మెయిల్ంగ్ చేసే ఉద్దేశం క్లియర్ గా కనిపిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల ముందు ఏదో రకంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వైకాపా ప్లాన్ అంటున్నారు.



