ఇట్టా చేసేవేంటి రెడ్డి..! ఆస్తి పోయే…ఆదాయం పోయే..!

alla-ramakrishna-reddy-lavanya-ysrcp-mangalagiri

ఏపీలో ఈనాటి ఎన్నికల బరిలో వైసీపీ – టీడీపీ రెండు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న నియోజకవర్గాలలో లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ఒకటి. గత ప్రభుత్వ టీడీపీ హయాంలో రాజధాని హోదా పొందిన ప్రాంతంగా నిలబడిన మంగళగిరి వైసీపీ ప్రభుత్వంలో కూల్చబడిన ప్రజావేదిక మాదిరి మిగిలిపోయింది.

ఈసారి ఎలా అయినా నెగ్గాలి అనే పట్టుదలతో లోకేష్, ఈసారి కూడా ఏదోకటి చేసి ఓడించాలనే ఆలోచనతో వైసీపీ హోరాహోరి ప్రచారాలు మొదలుపెట్టాయి. ఇంటిఇంటి ప్రచారంతో ప్రతి గడప తొక్కుతూ స్థానిక ప్రజలతో మమేకవుతూ వైసీపీ కన్నా ఒక డౌగ్ ముందు ఉన్నారు లోకేష్. అలాగే స్థానిక అపార్ట్మెంట్ వాసులను కూడా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ అటు పేదలనే కాకుండా మధ్యతరగతి వారిని కూడా ఆకట్టుకుంటున్నారు నారా లోకేష్.

ADVERTISEMENT

అపార్ట్మెంట్ వాసులను కలవడాన్ని పెద్దందారులతో లోకేష్ మంతనాలు అంటూ విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే అపార్ట్మెంట్ వాసులతో మాటామంతి ఏర్పాటు చేసారు. అయితే తాడేపల్లిలో ఒక స్థానిక గ్రెటెడ్ కమ్యూనిటీలో సమావేశం ఏర్పాటు చేసిన స్థానిక వైసీపీ నేత కరకట్ట కమలహాసన్ తనతో పాటుగా లోకేష్ కు ప్రత్యర్థిగా నిలబడుతున్న లావణ్యను వెంటపెట్టుకెళ్ళారు.

అయితే అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న ఒక వ్యక్తి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ భూమి ధర ఒక స్క్వేర్ ఫీట్ 5500 ఉండగా, వైసీపీ ప్రభుత్వం రాగానే 3500 కి పడిపోయింది. అంటే ఒక్కో వ్యక్తికీ ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో ఒక్కసారి ఆలోచించండి అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఇక్కడ రెడ్డి, కమ్మ సామజిక వర్గాల వారే ఎక్కువగా ల్యాండ్ లార్డ్స్ గా ఉన్నారు. ఈ రెడ్డి సామజిక వర్గం వారైతే పూజగదిలో కూడా వైస్సార్ ఫోటో పెట్టుకుంటారు.

అటువంటి వారు కూడా వైసీపీ ప్రభుత్వ విధానాల వలన తమ ఆస్తి విలువను సగానికి సగం కోల్పోయారు. ఆస్తి విలువ ఇంతలా పడిపోయిన మనసు చంపుకుని ఇంకా జగన్ వైపు నిలబడడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే రాజధాని పోయింది. రేపు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ యంత్రంగం మొత్తం విశాఖ వెళ్ళిపోతుంది. తద్వారా ఇక్కడ డెవెలప్మెంట్ ఆగిపోతుంది. భూమి విలువ అమాంతం తగ్గిపోతుంది.

ఒక చెట్టుగా ఎదిగిన ఈ ప్రాంతాన్ని కొమ్మలు నరికేస్తూ ఆదాయాన్ని, ఆస్తిని తగ్గిస్తూ పోతుంటే ఆ పర్యవసానాన్ని ఇక్కడ పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థి ఎదుర్కోకతప్పదు అంటూ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు సదరు వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో ఈసారి మంగళగిరిలో లోకేష్ టీడీపీ జెండా ఎగరేయడం ఖాయం అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీడీపీ శ్రేణులు.

మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబంలో మేలు జరిగితేనే మాకు ఓటేయండి అని అడుగుతున్న జగన్ మరి వైసీపీ ప్రభుత్వం వల్ల నష్ట పోతే ఏంచెయ్యాలో కూడా ఈ వీడియో చూసి సెలవిస్తే తెలుసుకుంటాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories