ఒకరేమో కామెడీకి కేరాఫ్ అడ్రస్. మరొకరు మాస్ డైలాగ్స్ కు ఆరాధ్యుడు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే మాట ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం “రోగ్” చిత్రానికి దర్సకత్వం వహిస్తున్న పూరీ జగన్నాధ్ – అల్లరి నరేష్ కాంభినేషన్ గురించి ఈ చర్చంతా. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మహేష్ బాబు చిత్రాలను లైన్ లో ఉంచిన పూరీ జగన్నాధ్ తాజాగా అల్లరి నరేష్ తో మరో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఊపందుకుంది.
మరో విశేషమేమిటంటే… “రోగ్” సినిమా పూర్తయిన వెంటనే ఈ కాంభినేషన్ సెట్స్ పైకి వెళ్ళబోతుందట. అంటే ఎన్టీఆర్, ప్రిన్స్ వంటి అగ్ర హీరోలను వదిలి పూరీ అల్లరోడు బాట పట్టబోతున్నాడన్న మాట. ఈ వైరైటీ కాంభినేషన్ తెరపైకి రావడమే ఆలస్యం, ఈ సినిమా అల్లరోడు తరహా కామెడీగా ఉంటుందా? లేక పూరీ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. ‘వన్ లైన్ పంచ్’లకు పూరీ ప్రసిద్ధుడు, లెంగ్తీ డైలాగ్ లతో కామెడీ పండించడంలో నరేష్ ప్రావీణ్యుడు. మరి వీరిద్దరి సినిమా ఎలా సెట్ అవుతుందో చూడాలంటే మరికొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.





