స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అల..వైకుంఠపురములో. ఆదివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మేకింగ్ వీడియోలో చిత్ర యూనిట్‌తో భార్య బన్నీ శ్రీమతి స్నేహ, బన్నీ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ సందడి చేయడం కనపడింది.
మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, కెమెరా నుండి చూస్తూ ఈ సినిమాకు నేనే నిర్మాతను అని చెప్పి నిర్మాతలకు షాకివ్వడం కొసమెరుపు. ఈ వీడియోలో అయాన్ ని చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు. ఇది ఇలా ఉండగా అల..వైకుంఠపురములో సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలకు ఇరు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో రోజుకు ఆరు షోలు, తెలంగాణలో ఐదు షోలకు వారం పాటు అనుమతినిచ్చారు. అదే విధంగా రేట్లు కూడా పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీనితో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. సినిమాకు దాదాపుగా 90 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ కారణాల వల్ల సినిమా బన్నీ మొదటి 100 కోట్ల సినిమా అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టబు, జయరాం, మురళీశర్మ, సముద్రఖని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. థమన్ అందించిన ఆల్బం సూపర్ హిట్ అయ్యింది.





