శాకుంతలంలో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన అర్హ

Allu Arha Shaakuntalamస్టార్ కిడ్స్ చిన్న వయసులోనే తెరమీద కనిపించడం సహజమే కానీ అందరూ చేయరు. చదువుల కోసమో లేదా అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతోనో వాళ్ళ ఎంట్రీని వాయిదా వేసుకుంటారు. గౌతమ్, సితారలను మహేష్ బాబు ఒక్క సినిమాకే పరిమితం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ డెబ్యూ శాకుంతలంతో చేయించిన సంగతి తెలిసిందే. పెద్దగా సస్పెన్స్ లేకుండా ఆ పాత్ర తాలూకు లుక్ ని ట్రైలర్ లోనే రివీల్ చేశారు.ఎలా చేసిందనే ఆసక్తి అభిమానుల్లో ఉండటం సహజం.

ఓవర్సీస్ కంటే అడ్వాన్స్ గా హైదరాబాద్ లో నాలుగు రోజుల ముందే ప్రీమియర్లు వేయడం విశేషం. అల్లు అర్హ నటన గురించి లుక్స్ గురించి ప్రత్యేక ప్రశంసలు అందుతున్నాయి. మాములుగా ఈ వయసు పిల్లలు కెమెరా ముందు ఎక్కువ సేపు నిలబడలేరు. ఏదో చిన్న నవ్వులు, నడవటం, పరిగెత్తడం లాంటివి చేస్తారు కానీ గ్రాంథికం టచ్ ఉన్న భాషలో డైలాగులు చెప్పడం కష్టం. కానీ గుణశేఖర్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అర్హ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కనిపించేది కాసేపే అయినా ముద్దు మాటలతో మురిపించేసింది.

ADVERTISEMENT

కథ ప్రకారం దుశ్యంతుడు శకుంతల కొడుకుగా నటించిన అర్హ హీరో దేవ్ మోహన్ కి ధీటుగా పలికే సంభాషణలు, శుభం కార్డుకు ముందు ప్రజలకు అభయమిస్తూ చెప్పే మాటలు క్యూట్ గా వచ్చాయి. అసలే అంచనాలు లేకుండా అర్హని చూడటంతో అందరికీ ఈ ఎపిసోడ్ స్పెషల్ ప్యాకేజయ్యింది. గతంలో ఇళయరాజా అంజలి అంజలి పాట కవర్ సాంగ్ లో మెప్పించిన అర్హ ఇప్పుడు యాక్టింగ్ టాలెంట్ ని బయట పెట్టింది. ఈ మాత్రం చేయడం మెచ్చుకోదగినదే. బన్నీ పుత్రికోత్సాహం ఎలా ఉంటుందో 14న రిలీజయ్యాక చూడాలి.

ADVERTISEMENT
Latest Stories