‘రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న మెగా హీరో అల్లు అర్జున్ కు అంతకంతకూ ఫాలోయింగ్ పెరుగుతూ పోతోంది. తాజాగా విశాఖపట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం విచ్చేసిన బన్నీని ఎయిర్ పోర్టులోనే అభిమానులు చుట్టుముట్టారు. ఊహించని ఈ ఘనమైన స్పందనతో ‘స్టైలిష్ స్టార్’ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఓ సిమెంట్ సంస్థకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న బన్నీ, సదరు సంస్థ కొత్త లోగోను లాంచ్ చేసేందుకు విశాఖ విచ్చేసారు. అయితే సదరు సమాచారం ముందుగానే తెలుసుకున్న మెగా అభిమానులు, భారీ సంఖ్యలో విచ్చేసి విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలకు ‘అంబాసిడర్’గా ఉన్న బన్నీ ఖాతాలో మరొక సంస్థ పడిందన్నమాట.
ADVERTISEMENT
ADVERTISEMENT



