ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదయ్యింది. హైద్రాబాద్ లోని ఐటీ కారిడార్ పరిధిలోని నానక్ రామ్ గూడా లోని కాస్మోస్ భవన ప్రాంగణానికి సంబంధించిన భూవివాదం విషయంలో ఆయన పై స్థానిక ఓనర్స్ అస్సోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసారు.
చంద్రశేఖర్ మరికొంతమంది కలిసి తమ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, సెక్యూటిరీ సిబ్బందిని బెదిరించి, తాళాలు పగలకొట్టి, అక్కడ నిర్మాణాలను ధ్వంసం చేసి, ఆ ప్రాంగణాన్ని తమ స్థలంగా ఆరోపిస్తూ ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారంటూ మంత్రి కాస్మోస్ అసోసియేషన్ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే చంద్రశేఖర్ రెడ్డి, అతనికి మద్దతుగా వచ్చిన వారు కలిసి సదరు ప్రాంగణంలో చేసిన చర్యలకు సాక్షాలుగా అక్కడనున్న సీసీ టీవీ ఫోటేజ్ రికార్డు లను సైతం పోలీసులకు అందించారు ఫిర్యాదుదారులు.
తమ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడి, అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది పై దాడి చేసిన చంద్రశేఖర్ రెడ్డి, అతని పరివారం పై తక్షణమే చర్యలు తీసుకుని తమ ఆస్తిని రక్షించాలంటూ మంత్రి కాస్మోస్ యజమానులు సంఘం డిమాండ్ చేస్తుంది.
అయితే ఈ వివాదం పై ఇంకా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ తన వాదన వినిపించలేదు. చూడాలి మరి ఈ భూ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా.? లేదా రాజకీయ రంగు పులుముకుంటుందా అనేది.?





