బన్నీ నెక్స్ట్ సినిమా ఇదే…!

Allu Arjun silence on his next movieస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
దూసుకుపోవాల్సిన బన్నీ ఎందుకు స్లో అయ్యాడు? 2018 మేలో వచ్చిన నా పేరు సూర్య భారీ డిజాస్టర్ తర్వాత బన్నీ తన నెక్స్ట్ సినిమాపై భారీ ఫోకస్ పెట్టాడా? అందుకే ఇప్పటివరకూ తన తర్వాత సినిమా గురించి ఎక్కడా ఏ న్యూస్ వినిపించడం లేదా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది…

[m9ad]

ADVERTISEMENT

ఎందుకంటే ఒక్కసారి బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎవరితో అన్న మాటను తీసుకుంటే ఇప్పటికి 2019 లో సైరా సినిమాలో బన్నీ చేస్తున్న పాత్ర మినహా అల్లు అర్జున్ మరో సినిమా గురించి ఎక్కడా వార్తలు వినిపించకపోవడం కాస్త వింతగానే ఉంది..

అయితే టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో నా..లేక గీతా గోవిందం లాంటి భారీ హిట్ ఇచ్చిన ఆస్థాన దర్శకుడు పరశురామ్ తోనా అన్న అనుమానం ఉంది ఇప్పటివరకూ…

ఇక తాజా అప్డేట్ ప్రకారం బన్నీ నెక్స్ట్ సినిమాని హారికాహాసినీ బ్యానర్ వాళ్ళు గీత ఆర్ట్స్ తో అనుసంధానం అయ్యీ… త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఆ బ్యానర్ అధినేత చినబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు …ఈ సినిమాలో సరికొత్త లుక్ తో బన్నీ అలరించనున్నాడు అని తెలుస్తుంది..మరి ఇప్పటికే రెండు సినిమాలతో అలరించిన ఈ కాంబో..ఇప్పుడు మూడో సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories