వెళ్లిపోదాం అనుకుంటుండగా… బన్నీ ఫోన్ చేసారు..!

Allu-Arjun--Sekhar-Masterఒక వైపున కొరియోగ్రాఫర్ గా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే .. మరో వైపున డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. “విజయవాడలో ఉండగానే డాన్స్ పట్ల ఆసక్తి ఏర్పడింది. నేను కూడా సినిమాల్లో ఒక డాన్సర్ గా వుంటే బాగుంటుందే అనిపించింది. దాంతో హైదరాబాద్ వచ్చి బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ లో చేస్తూ… రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఆ తరువాత కొరియోగ్రాఫర్ ను అయ్యాను” అని పంచుకున్నారు.

ఫస్టు నాకు పేరు వచ్చిన సాంగ్ .. ‘ఎస్. ఎమ్. ఎస్. చిత్రంలోనిది. ఈ సినిమాలోని సాంగ్ చూసే బన్నీ, ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చారు. సినిమాలు చేస్తున్నాను… పైకి రావడం లేదు… ఇంక వెళ్లిపోదాం ఊరు అనుకుంటున్నాను. ఆ సమయంలో బన్నీ ఫోన్ చేశారు, ఈ సాంగ్ బాగా చేస్తే నిలబడతావ్… లేదంటే ఊరెళ్లిపోతావ్ అని మనసులో అనుకున్నాను. ‘ డాన్స్ పట్ల నీ అంకిత భావం చూస్తుంటే .. అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేవాడిని’ అని బన్నీ అన్నారంటూ నవ్వేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories