ఎన్నో రాజకీయ దాడులను, ఎన్నో కుట్ర కోణాలను, మరెన్నో అసత్య ప్రచారాలను తట్టుకుని నిలబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈ నెల 13 న CRDA కార్యాలయ ప్రారభం వేడుకలతో తన తొలి అడుగు వేయనుంది.
అయితే రాష్ట్ర విభజన తరువాత బాబు కి ఉన్న అపార రాజకీయ అనుభవం దృష్ట్యా, ఆయన గత పాలన మీద విజనరీ మీద ఉన్న నమ్మకం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ కి పట్టం కట్టారు. బాబుని గద్దెనెక్కించారు.
నాటి ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, తన విజ్జనరీని నేటి తరం యువతకు మరోసారి పరిచయం చేసేందుకు బాబు కి పుష్కర కాలం పట్టింది. 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాజధాని ఎంపిక, భూసమీకరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇలా ఐదేళ్ల సమయాన్ని రెండున్నరేళ్ళకు కుదించుకుంది.
ఆ సమయంలో రాజధాని గా అమరావతికి చేయగలిగిందంతా చేసారు బాబు. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతికి వైసీపీ గ్రహణం పట్టింది. ఆ ఐదేళ్లు అమరావతిలో అడుగు పెట్టిన పారిశ్రామిక వేత్త లేరు, అలాగే అమరావతి వైపు కన్నెత్తి చూసే వ్యాపార వేత్త లేడు.
ఉద్యమాలు, పోరాటాలతో తప్ప అమరావతి పేరు మీడియాలో ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు. గతంలో పచ్చటి పంట పొలాలతో కలకాలాడే రాజధాని ప్రాంతం ఆ తరువాత పెట్టుబడి దారులతో, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పారిశ్రామిక ప్రగతి సాధించింది.
ఇక వైసీపీ హయాంలో పరదాలతో, పోలీస్ పెట్రోలింగ్ లతో, అడుగడునా ఆంక్షలతో, రోడ్ల మీద టెంట్లతో, సేవ్ అమరావతి అనే నినాదాలతో మారుమోగింది. అయితే 2024 ఎన్నికలలో ఆ రైతు కుటుంబాల కన్నీటి శోకానికి వైసీపీ మూల్యం చెల్లించక తప్పలేదు.
దానితో రాజధానిగా అమరావతి కి పునర్జన్మ వచ్చినట్లయ్యింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వ హయం లోనే ఎట్టిపరిస్థితులలో రాజధానిగా అమరావతికి ఒక కళను తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని శోభను అందించాలని కంకణం కట్టుకున్నారు.
అలాగే ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మొదటిగా రాజధానిలో CRDA కార్యాలయం ఓపినింగ్ కి ముహూర్తం పెట్టారు బాబు. రాజధాని ప్రాంతమైన రాయపూడిలో సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 257 కోట్ల వ్యయంతో, జి +7 గా నిర్మించిన ఈ భవనం ఈ నెల 13 ఉదయం 9.54 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఇక రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో బాబు నిర్మించుకుంటున్న తన సొంత ఇంటి పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. సుమారు 5 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ఇంటి నిర్మాణంలో ఇప్పటికి ఇంటి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి పనుల వేగం పెంచారు.
అయితే నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకుల చేత కుల నిందలు మోసిన అమరావతి, బురద రాజకీయాను తట్టుకుని నేడు ప్రారంభోత్సవ వేడుకలతో తన తొలి అడుగులు వేస్తుంది.




