మభ్య పెట్టె రాజకీయాలు, ప్రజలను ఏమార్చే రాజకీయాలు చేయడంలో వైసీపీ మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఒక పక్క వైసీపీ సమాధి చేసిన అమరావతిలో పునాదులు భవనాలుగా ఆవిష్కరింపబడుతున్నాయి.
అయితే ఇదిలా ఉంటే రాష్ట్రంలో కల్తీ మద్యం నిషేధించాలి అంటూ వైసీపీ క్యాడర్ చేస్తున్న నిరశన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాక్షి రాష్ట్రానికి ఇంత ముఖ్యమైన వార్తలను ప్రసారం చేయడానికి ముందుకు రాలేకపోతుంది.
వైసీపీ ఎంతలా ద్వేషిస్తున్నా, మరెంతలా అణిచివేయాలని చూసినా, సాక్షి తన అసత్య ప్రచారాలతో అమరావతిని సర్వ నాశనం చెయ్యాలని భావించినా అమరావతి శాశ్వత భవనాల రూపంలో ప్రజలకు, అధికారులకు అందుబాటులోకి వచ్చాయి.
ఇన్నాళ్లు అమరావతిలో నిర్మాణాలే లేవు, కట్టిన ఆ కొన్ని భవనాలు సచివాలయం, హై కోర్ట్ కూడా తాత్కాలిక భవనాలే, అసలు అమరావతి భూమి నిర్మాణాలకు అనువైనది కాదు అంటూ వైసీపీ చేసిన ప్రచారాలన్నిటిని పటాపంచలు చేస్తూ ఆ ప్రాంత రైతుల త్యాగాలను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నేడు రాయపూడి లో CRDA భవనం ప్రారంభంయ్యింది.
అయితే ఈ భవనం లోపల ఒక పోస్టర్ రూపంలో రాజధాని నిర్మాణానికి, CRDA నిర్మించిన ప్రాంతానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ఫోటోలను గ్యాలరీ మాదిరి అమర్చారు. దీనితో ఆ రైతుల త్యాగాలు – గత ఐదేళ్ల వైసీపీ ఘోరాలు భవనం లోపలికి వెళ్లిన ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసారు.
దీనితో ఇంతమంది రైతు కుటుంబాలు ఒక రాష్ట్ర రాజధాని కోసం, ఆరు కోట్ల ప్రజల గుర్తింపు కోసం ఇన్ని వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు అనే వారి ఉదార్తత తెలియడం తో పాటుగా, ఇంతమంది త్యాగాలను, ఇంత విస్తారమైన భూమిని ఐదేళ్లు అరణ్యంగా మార్చిన వైసీపీ అరాచకం కూడా అందరి కళ్ళ ముందు సాక్ష్యాత్కారం అవుతుంది.
అలాగే అమరావతి స్థల బలం బ్రహ్మాండంగా ఉందని, ఇక్కడి ప్రజానీకం గతంలో చేసిన పొరపాటు మరెప్పుడు చెయ్యకూడదని, దాని ఫలితం గత ఐదేళ్లు అమరావతి రైతులతో పాటు తనను రాష్ట్రాన్ని వేధించాయంటూ, అతి త్వరలోనే రాజధానికి భూములిచ్చిన రైతులను కలిసి మాట్లాడి వారి సమస్యలకు ఒక పరిష్కారం చూపుతానంటూ హామీ ఇచ్చారు బాబు.




