ఈ ఏడాది ఫస్ట్ ‘బ్లాక్ బస్టర్’ వచ్చేస్తోంది!

Mindless-Attack-on-Anushka-Shetty-'Bhaagamathie'2017 ఏడాది తొలి భాగం టాలీవుడ్ కు ఎంతటి మధురానుభూతులను మిగిల్చిందో, 2018వ సంవత్సరం అంతటి చేదు అనుభవాలను చవిచూస్తోంది. సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలు దారుణంగా విఫలం కావడంతో పాటు, చిన్న సినిమాలు కూడా భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి వాతావరణంలో ఈ ఏడాదిలో ఫస్ట్ సూపర్ హిట్ సినిమాగా అనుష్క “భాగమతి” నిలిచింది.

‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. నిజానికి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ధియేటర్లలో హంగామా చేస్తూనే ఉంది. సిల్వర్ స్క్రీన్ పై ఇంత విజయవంతమైన సినిమా మరో మూడు రోజుల్లో ఆన్ లైన్ లో ప్రత్యక్షం కానుంది. ఈ నెల 26వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

ADVERTISEMENT

గతంలో నాని నటించిన ‘ఎంసీఏ’ సినిమాకు కూడా ఇలాంటి అనుభవాన్నే చవిచూసింది. ఓ పక్కన ధియేటర్లలో ఉండగానే, మరో పక్కన అమెజాన్ లో అందుబాటులోకి రావడంతో, అది కాస్త ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా, విడుదలైన నెల రోజుల తర్వాత అమెజాన్ లో అప్ లోడ్ అవుతుండడం కొంతవరకు సినిమా కలెక్షన్స్ ను దెబ్బతిస్తోన్న మాట వాస్తవమే అయినా, ఆన్ లైన్ హక్కుల రూపంలో నిర్మాతకు భారీ మొత్తం లభిస్తుండడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories