
ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిన్నట్లే ఉన్నాఋ. ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో మంత్రులు రోజా (నగరి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుననూరు), బుగ్గన రాజేంద్రనాధ్ (డోన్), గుడివాడ అమర్నాథ్ (గాజువాక) వెనకబడిపోగా బొత్స సత్యనారాయణ ఒక్కరే ఆధిక్యంలో కొనసాగుతున్నారు, వైసీపి ఎమ్మెల్యేలలో కొడాలి నాని (గుడివాడ), వల్లభనేని వంశీ (గన్నవరం) వెంకబడిపోయారు. కొడాలి నాని రెండో రౌండ్ ఫలితాలు చూసి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన వైసీపి ప్రత్యర్ధి వంగా గీతపై ఉదయం 10.15 గంటలకు 19,000 ఓట్ల ఆధిక్యతలో దూసుకుపోతున్నారు.
Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!
జిల్లాల వారీగా చూస్తే ప్రతీ ఎన్నికలలో కీలకమైన తూర్పు(16), పశ్చిమ గోదావరి(12) జిల్లాలలో కలిపి టిడిపి కూటమి 28 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా ఆ రెండు జిల్లాలో వైసీపి కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.