టైగర్ రాంబాబు కొత్త పాత్రలో జీవించేస్తున్నారుగా

Ambati Rambabu Turns ‘Tiger’ After Jail Episode

ఎవరు అవునన్నా కాదన్నా, ముఖ్యంగా.. టీడీపి వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా అంబటి రాంబాబు ఏపీ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌.

ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ‘కాన్ఫిడెన్స్ లెవెల్స్’ విపరీతంగా పెరిగిపోయాయి. అది అయన మాటల్లోనే కనిపిస్తోంది.

ADVERTISEMENT

ఆయనకి ఇంతగా మీడియా అటెన్షన్ లభిస్తుండటం, ఆయన దానిని 101 శాతం వాడేసుకుంటున్న తీరు చూస్తున్నవారు ముఖ్యంగా వైసీపీ నేతలు… అందునా కాపు నేతలు… జగన్‌ ఇచ్చిన గొప్ప ఛాన్స్ (సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టి జైలుకి వెళ్ళే ఛాన్స్) మిస్ చేసుకునందుకు బహుశః లోలోన బాధపడుతూనే ఉంటారు.

ప్రతీ కుక్కకీ ఒకరోజు వచ్చినట్లే ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఓ రోజు వస్తుందని అంబటి అన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నప్పటికీ ఇప్పటికే ఆ రోజు వచ్చేసింది కదా? అని వైసీపీలో కాపు నేతలు బహుశః లోలోన ఈర్ష్య పడుతూనే ఉంటారు.

అయితే తనకు చూపించిన 18 రోజుల సినిమాలో హీరో ఎవరు? విలన్లు ఎవరు? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఖచ్చితంగా హీరో ఆయనే. నో డవుట్!

కానీ సిఎం చంద్రబాబు నాయుడు, పోలీసులు విలన్లు కారు. వారు కేవలం పాత్రధారులు మాత్రమే. ఎందుకంటే ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా జగన్మోహన్ రెడ్డి చేశారు.

ఆయన నడిపించినట్లే కథ, దానిలో పాత్రలు నడిచాయి. అంబటి రాంబాబు ‘టైగర్ రాంబాబు’గా పరకాయ ప్రవేశం చేసి ‘ఐ డోంట్ కేర్’ అంటూ ఈ సినిమాని రక్తి కట్టించి సూపర్ హిట్ చేశారు. అయినా ఈ క్రెడిట్ మొత్తం జగన్‌కే దక్కాలి. దేనికంటే పుష్ప సినిమా ఎంత సూపర్ హిట్ అయినప్పటికీ అందరూ అల్లు అర్జున్‌ గురించే చెప్పుకుంటారు తప్ప సుకుమార్ గురించి కాదు కనుక.

అలాగే ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసిన అంబటి రాంబాబు గురించే అందరూ చెప్పుకుంటున్నారు. జైలులో ‘హ్యాపీడేస్’ అని రాంబాబు తేల్చి చెప్పేశారు. కనక బయటకు రాగానే మళ్ళీ లోనికి వెళ్ళిపోవాలని పోలీసులతో కాసేపు ఆడుకున్నారు కూడా.

కానీ జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఇష్టపడనట్లే, రాంబాబుని మళ్ళీ లోపలేసి ‘స్వాతంత్ర సమర వీరుల హోదా’ ఇవ్వడం ఇష్టం లేక కూటమి ప్రభుత్వం మిన్నకుండిపోయింది.

కనుక ఈ సినిమా ఓటీటీలోకి అంటే మళ్ళీ మరో కేసులో జైలుకి వెళ్ళే వరకు ఈ షో ఇలా కంటిన్యూ చేసే బాధ్యత ఆయనదే. ఆయన మేనేజ్ చేయగలరు కూడా.

ఎందువల్ల అంటే ఈ కొత్త పాత్రలో మంచి పంచ్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు, సెంటిమెంట్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి కూడా. కనుక మంత్రిగా రాంబాబు ప్రజలను, జగన్‌ని మెప్పించలేకపోయి ఉండొచ్చు కానీ ఒకసారి ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఇరగదీసేయడం… జనాలను మెప్పించడం ఖాయమే.

కానీ ఇంతకాలం ఇలాంటి అవకాశానికి, గుర్తింపుకి నోచుకోక సంబరాల రాంబాబుగా మిగిలిపోయిన అంబటి ఇప్పుడు టైగర్ రాంబాబుగా జగన్‌ కంటే పాపులర్ అయిపోతేనే చాలా ప్రమాదం. విజయసాయి రెడ్డి, షర్మిలలా తీసి పక్కన పడేసే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories