తెలంగాణ బీజేపీ శ్రేణులను నిరాశపరచిన అమిత్ షా

We-Have-No-Issues-With-Chandrababu-Naidu---Amit-Shahబీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా 22న హైదరాబాద్‌ రానున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పర్యటన ఉంటుందని ఇదివరకే ఆ పార్టీ ప్రకటించింది. అమిత్ షా ఇక్కడకి రావడంతో రాష్ట్రంలో బీజేపీ రూపురేఖలు మారిపోతాయని కార్యకర్తలు భావించారు. అయితే ఆయన ఒక్కరోజే తెలంగాణకు కేటాయించారు.

గత ఎన్నికల్లో పార్టీ గెలవని 120 స్థానాలపై దృష్టిపెట్టిన కమలదళం ఆయా నియోజకవర్గాల తీరుతెన్నులపై ఓ అంచనాకొచ్చింది. ఇందులో తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలపై అమిత్ షా దృష్టి సారిస్తారని అంతా భావించారు. ఆ 120 నియోజకవర్గాలే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే అమిత్‌ షా పర్యటన ప్రారంభించారు.

ADVERTISEMENT

అయితే తెలంగాణాలో ఒక్కరోజు మాత్రమే ఆయన ఉండడంతో శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఇందులో భాగంగా 22న రాష్ట్ర నేతలతో భేటీ నిర్వహించనున్నారు. 2019లో బీజేపీ కనీసం ప్రధాన ప్రతిపక్షంలోకి తీసుకురావాలని కమలం పార్టీ టార్గెట్ గా ఉంది. అయితే రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories