శ్రీదేవి మరణాన్ని అమితాబ్ ముందే ఊహించారా?

Amitabh Bachchanశ్రీదేవి మరణాన్ని అమితాబ్ ముందే ఊహించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం ఇది. అవును… శ్రీదేవి కాలం చేయడానికి కొద్ది నిముషాల ముందు ట్విట్టర్ లో అమితాబ్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. “ఎందుకో తెలియదు, ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నా” అంటూ ఏదో చెడు జరగబోతున్న ఉద్దేశాన్ని అమితాబ్ వ్యక్తం చేయడంతో… బిగ్ బి సిక్స్త్ సెన్స్ ముందే చెప్పిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ ట్వీట్ తర్వాత శ్రీదేవి మరణం గురించి అమితాబ్ మరే ట్వీట్ చేయలేదు. అంటే అందరికంటే ముందుగా శ్రీదేవి మరణం అమితాబ్ చెవిన పడిందని చెప్పవచ్చు. శనివారం నాడు రాత్రి 11 -11.30 ప్రాంతంలో శ్రీదేవి మరణించినట్లుగా ఆమె మరిది సంజయ్ కపూర్ స్పష్టం చేసారు. బిగ్ బి ఏమో 1.15 నిముషాలకు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ వచ్చిన మరో 20 నిముషాలకు అధికారిక సందేశం వెలువడింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న బిగ్ బి, శ్రీదేవి కుటుంబానికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories