ఆమ్రపాలి ఐఏఎస్… ఈ దుస్థితి నాట్ గుడ్!

Amrapali Kata IAS Shifted From AP Tourism Department

సీనియర్ ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలిని పర్యాటక శాఖ నుంచి తప్పించి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.

ఆమె మొదట తెలంగాణలో పని చేసినప్పుడు చాలా సమర్దురాలు, చురుకైన అధికారిణిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ADVERTISEMENT

కానీ ఆంధ్రాకు బదిలీ చేసినప్పుడు న్యాయ పోరాటాలు చేస్తూ కొంతకాలం గడిపేశారు. కానీ చివరికి బదిలీపై ఏపీకి రాక తప్పలేదు.

ఆమె అయిష్టంగా వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పట్ల అమర్యాదగా వ్యవహరించలేదు. ఇదివరకు తీవ్ర నిరాదరణకు గురైన పర్యాటకశాఖకి ప్రభుత్వం పరిశ్రమ హోదా కల్పించి, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోంది.

కనుక ఆమె సమర్ధతతని గుర్తించి, గౌరవిస్తూ పర్యాటకశాఖ అప్పజెప్పింది. కానీ ఆ శాఖలో ఆమెకు చేదు అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయో లేక అసలు ఏపీలో పని చేయడం ఇష్టం లేకనో, ఆమె దీర్గ కాలిక సెలవు తీసుకున్నారు. ఆవిధంగా అయిష్టతని చాటుకుంటునప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు. కనుక తదనుగుణంగానే వ్యవహరించక తప్పలేదు. అందుకే ఆమెను కీలకమైన ఆ శాఖ నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

కారణాలు, పర్యవసానాలు ఏవైనప్పటికీ ఆమ్రపాలి వంటి సమర్ధురాలైన ఐఏఎస్ అధికారిణి నేడు ఇటువంటి పరిస్థితిలో ఉండటం చాలా బాధాకరమే.

ADVERTISEMENT
Latest Stories