ఆనం పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయ్యిందా?

Anam Ramanarayana Reddy Meets YS Jagan in Lotus Pondమాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగు దేశంలో తనకు సముచిత గౌరవం లభించడం లేదంటూ వైకాపాలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఆయన లోటస్ పాండ్ లో జగన్ ను కలిశారట. అయితే జగన్ ప్రవర్తనకు ఆయన విస్తుపోయారట. సీటు సంగతి ఉంటే తరువాత మాట్లాడదాం ముందు పార్టీలో చేరండి అని జగన్ ఆయనకు చెప్పారట.

ఇంతటి సీనియర్ కు ఆ సమాధానంతో మతి పోయినట్టు అయ్యిందంట. పైగా ఆయనకు వ్యతిరేకంగా మేకపాటి వర్గాన్ని జగన్ ఇప్పటికే జిల్లాలో ఎగదోస్తున్నారట. దీనితో ఈ సమయంలో పార్టీ మారితే మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆనం భావిస్తున్నారట. టీడీపీలో గౌరవం సంగతి ఎలా ఉన్నా కనీసం సీటు అయినా వచ్చేదని ఇప్పుడు వైకాపాలో ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయన కలవరపాటుకు గురి అవుతున్నారు.

ADVERTISEMENT

ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరాలన్నది ఆగస్టులో నిర్ణయించుకుందామని చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీలోనే ఉంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలింది ఏం చేస్తుందో తెలియని జనసేన. అతీగతీ లేని బీజేపీ. ఆనం పైనం ఏటో చూడాలి మరి.

ADVERTISEMENT
Latest Stories