జగన్ కు వాళ్ళంటే మోజు ఎక్కువ!

Anam vivekananda reddy satire ys jaganవైఎస్సార్సీపీ అధినేత జగన్ మంచోడా? చెడ్డోడా? అన్నది తమకు అనవసరమని… అయితే జగన్ ఖచ్చితంగా మంచోడు మాత్రం కాదని నెల్లూరు జిల్లా నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి తన వాగ్ధాటిని ప్రదర్శించారు. అప్పట్లో జగన్ గురించి తెలియక ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరామని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం అలా చేయకుండా మంచి పని చేసిందని, జగన్ వైఖరిని దుయ్యబట్టారు.

తన వరకు తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డే తనకు గురువని, తాము వైఎస్సార్సీపీలోకి వెళ్లే ప్రయత్నం చేయలేదని, ఇక ముందు కూడా చేయమని తేల్చిచెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో జగన్ ను పోల్చకూడదని, వైయస్ కు పూర్తి వ్యతిరేకంగా జగన్ ఉంటాడని అన్నారు. తాము ప్రజలతో ఉన్నామని, ప్రజలు తమతో ఉన్నారని ఆనం… జగన్ కు డబ్బున్న వాళ్లంటే మోజు ఎక్కువ అంటూ విమర్శలు గుప్పించారు. తాము కాంగ్రెస్ లో ఉండగా, తమను బయట కూర్చోబెట్టి, డబ్బున్న వారిని లోపల కూర్చోబెట్టి మాట్లాడే వారని, జగన్ చాలా అహంకారమని మండిపడ్డారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories