ఫ్లాప్ సినిమాలలో ఉన్నాను… కనికరించమన్న స్టార్ హీరో..!

ranbir-kapoor-ae-dil-hai-mushkil“ఏ దిల్ హై ముష్కిల్” సినిమా విడుదల కావడం తనకు చాలా అవసరమని స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తన గోడు వెలిబుచ్చుకున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, ‘ఎమ్మెన్నెస్’ హెచ్చరికల నేపథ్యంలో మరియు పాక్ నటులున్న సినిమాలను తమ థియేటర్లలో విడుదల కానివ్వమని ధియేటర్ల యజమానులు కూడా స్పష్టం చేయడంతో… ఈ సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT

ఇలా ప్రకటించిన థియేటర్లు ఇప్పటికే సుమారు 400గా లెక్క తేలాయి. దీంతో చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసి, భారీ ఓపెనింగ్స్ లాగేయొచ్చని భావించిన సినిమా యూనిట్ కు షాక్ తగిలింది. దీంతో ఓ వీడియో సందేశాన్నిస్తూ దర్శకుడు కరణ్ జొహార్ విడుదలకు సహకరించవలసిందిగా కోరగా.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రణ్ బీర్ కపూర్… తాను ఫ్లాపుల్లో ఉండడంతో తీవ్ర నిరాశలో ఉన్నానని తన సినీ కష్టాలను ప్రకటించుకున్నాడు.

“తాను ఇప్పటికే ఎంతో నష్టపోయానని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క హిట్ తన ఫేట్ మారుస్తుందని, ఈ సినిమా విడుదల తనకు చాలా అవసరమని” పేర్కొన్నాడు. గత నవంబర్ లో ‘తమాషా’ సినిమా విడుదల కాగా, ఇన్నాళ్ల విరామం తరువాత ఈ సినిమా వస్తోందని, ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే… జైలు నుంచి విడుదలైనంత ఉపశమనం తనకు లభిస్తుందని, ఓ విధంగా తనను కనికరించాల్సిందిగా రణ్ బీర్ కపూర్ విన్నవించుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories