మరిన్ని చిక్కుల్లో పడుతోన్న యాంకర్!

anchor Pradeep absconding drunk drive caseకొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన టాలీవుడ్ టాప్ యాంకర్ ప్రదీప్ బుధవారం నాడు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ కు తన తల్లి లేక భార్య లేదా సమీప బంధువుతో కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రదీప్ రాకపోగా, పోలీసులు మణికొండలోని అతని ఇంటి వద్దకు వెళ్ళగా తాళం వేసి ఉండడం గమనించారు. అలాగే ప్రదీప్ ఆఫీస్ కూకట్ పల్లిలో ఉందని తెలిసి, అక్కడకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడంతో పోలీసులకు అందుబాటులో లేకుండా పోయాడన్న విషయం అర్ధమైంది.

దీంతో గురువారం నాడు కూడా వేచిచూసి, రాని పక్షంలో ప్రదీప్ పై న్యాయపరమైన చర్యలకు దిగుతామని పోలీస్ వర్గాలు వెల్లడించారు. యాంకర్ ప్రదీప్ ను పరారీలో ఉన్నట్లుగా డిక్లేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు, నేడు కూడా కౌన్సిలింగ్ కు హాజరు కాని పక్షంలో ‘లా అండ్ ఆర్డర్’ విభాగానికి సమాచారం అందజేస్తామని అన్నారు. కౌన్సిలింగ్ కు వస్తే కొద్దిరోజులు జైలు శిక్ష అయినా ఖాయం అన్న టాక్ తోనే ప్రదీప్ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడన్న టాక్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ పరిణామాలతో ప్రదీప్ సరికొత్త చిక్కులు తెచ్చిపెట్టుకున్నట్లవుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories