కొత్త ఏడాది… 2 రోజులు… టాలీవుడ్ కు 2 షాకులు..!

Anchor-Pradeep--Gajal-Srinivas-Arrestedగత సంవత్సరాలతో పోలిస్తే… 2017 సంవత్సరంలో ఎక్కువ విజయాలను సొంతం చేసుకుని “ఎంసీఏ” సక్సెస్ తో ఘనంగా ముగించుకుని, 2018లోకి ప్రవేశించిన టాలీవుడ్ కు కొత్త సంవత్సరంలో వరుసగా రెండు రోజుల్లో రెండు షాకులు ఎదురయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల రాత్రే ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో పట్టుబడగా, వరుసగా రెండవ రోజు నాడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు పరిచయం అయ్యింది.

గజల్ అయితే ఏకంగా జైలుకు తరలగా, ప్రదీప్ కు కూడా చిన్నపాటి జైలు శిక్ష పడుతుందన్న టాక్ వినపడుతోంది. జైలుకు వెళ్ళినా, లేకున్నా గానీ ఈ ఉదంతంతో ప్రదీప్ డీఫేం అయ్యారన్నది వాస్తవం. ఎందుకంటే గతంలో ఇదే ప్రదీప్… మద్యం సేవించి వాహనాలు నడపవద్దు అంటూ ప్రచారం నిర్వహించగా, ఇపుడు ఆయనే స్వయంగా పట్టుబడడంతో పరువు పోగొట్టుకున్నట్లయ్యింది. సెలబ్రిటీలకు ఇదంతా మామూలే అనుకున్నా గానీ, ఇప్పటివరకు ఉన్న ‘మంచి బాలుడు’ ముద్రను ప్రదీప్ చెడగొట్టుకున్నట్లయ్యింది.

ADVERTISEMENT

ఇక గజల్ శ్రీనివాస్ అంశం అయితే షాకింగ్ లాంటిదే. సమైక్యాంధ్ర ఉద్యమంతో సహా చాలా సామాజిక అంశాలపై గళం విప్పిన గజల్ శ్రీనివాస్, గతంలో మహిళలపై అక్రమాలు జరుగుతున్న సమయంలో కూడా వాటికి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించారు. అలాంటి గజల్ శ్రీనివాస్ ఇపుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలతో సహా ఇరుక్కోవడం ఊహించనిదిగా పేర్కొనవచ్చు. బెయిల్ పై విచారణ వాయిదాతో ఏకంగా జైలు జీవితం గడిపే స్థాయికి గజల్ చేరుకోవడంతో, మూడో రోజు ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో నిరీక్షించడం మీడియా వర్గాల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories