ఇటువంటి చెత్త ఐడియాలతో ఏపీలో కింగ్ మేకర్లు అయిపోతారా?

BJP-Andhra-Pradesh-ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకి ప్రజామద్దతు లేకపోయినా కింగ్ మేకర్ కి తక్కువ కాకుండా ఉన్నాయి ఆ పార్టీ ఆశలు. ఇటీవలే కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లలో 12 సీట్లలో పోటీ చేస్తే ఆ పార్టీ గెలిచింది మూడు అది కూడా టీడీపీ పొత్తుతో. ఐన ఆ పార్టీ నాయకులు ఊహల తీరంలో విహరిస్తూనే ఉన్నారు.

పైగా కూర్చున్న కొమ్మనే విరగొట్టినట్టు మిత్రపక్షం టీడీపీని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీలో కొందరు నాయకులు. ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి వ్యూహాలు రచించడం మానేసి సొంతవారికే గోతులు తవ్వుతున్నారు. ఇప్పుడు టీడీపీని ఎదురుకోవడానికి ఆ పార్టీ ఒక సరికొత్త చెత్త ఐడియాతో ముందుకు వస్తుంది.

ADVERTISEMENT

ఇటీవలే సుజనా చౌదరి పార్లమెంట్ లో స్పెషల్ స్టేటస్ గురించి ఎత్తడం ఆ పార్టీకి నచ్చలేదు. తమని ఇరుకునపెడదాం అని చూస్తున్న టీడీపీని ఎదురుకోవడానికి ఎదురుదాడి ప్రారంభించారు. స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి చంద్రబాబే కారణమని, ఆయన వద్దు అనడం వల్లనే కేంద్రం స్పెషల్ ప్యాకేజీ వైపు మొగ్గిందని ఆ పార్టీ ఆరోపిస్తుంది.

చెప్పేవారికి ఎలా ఉందో గానీ వినేవాళ్లకి మాత్రం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వ్యూహాలతో 2019లో తామే హీరోలం అయిపోతాం అనుకుంటే బీజేపీని రాష్ట్రంలో మోడీ కూడా కాపాడలేడు. తొందర్లో రిపేర్ చెయ్యకపోతే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవ్వడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories