అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేడు వచ్చేస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా వాటిలో టిడిపి: 66, జనసేన: 10, బీజేపీ:2, వైసీపి: 12 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
అదేవిదంగా 25 ఎంపీ సీట్లకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో టిడిపి: 11, జనసేన: 0, బీజేపీ: 4, వైసీపి: 3 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (కుప్పం), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (పిఠాపురం), టిడిపి యువనేత నారా లోకేష్ (మంగళగిరి), టిడిపి నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్), ఆదిరెడ్డి వాసు (రాజమండ్రి సిటీ), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట), ధూళిపాళ నరేంద్ర (పొన్నూరు), బోండా ఉమా( విజయవాడ సెంట్రల్), వెనిగండ్ల రాము (గుడివాడ), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), దామాచర్ల జనార్ధన్ (ఒంగోలు), సుజయకృష్ణ రంగారావు (బొబ్బిలి), మురళీమోహన్ (పూతలపట్టు), కొలికపూడి శ్రీనివాస్ (తివూరు), దగ్గుబాటి పురందేశ్వరి (రాజమండ్రి-ఎంపీ), కేశినేని చిన్ని (విజయవాడ- ఎంపీ), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసారావుపేట-ఎంపీ) ఆధిక్యంలో ఉన్నారు.
వైసీపి అభ్యర్ధులలో జగన్మోహన్ రెడ్డి (పులివెందుల), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), అవినాష్ రెడ్డి (కడప-ఎంపీ) ఆధిక్యంలో ఉన్నారు.
ఈ ఆధిక్యతలు కూటమి విజయాన్ని సూచిస్తుండగా, సాక్షి మీడియాలో మాత్రం వైసీపి ఘనా విజయం సాధించబోతోందని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆరా మస్తాన్ తదితరులు చెపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయమైన చాలా ఆచితూచి తీసుకుంటారని, దానిపై పూర్తి నమ్మకంతో అమలుచేస్తుంటారని అందువల్లే ఈ ఎన్నికలలో వైసీపి ఘన విజయం సాధించబోతోందని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అభిమాన విశ్లేషకులు చెపుతున్నారు.
వైసీపి ఆదిక్యతలో ఉన్న సీట్లను మాత్రమే చూపిస్తూ టిడిపి, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల రేసులో వెనకబడిపోయిందని, కానీ ఎల్లో మీడియా ఎన్నికల ఫలితాలను కూడా టిడిపి, జనసేన, బీజేపీలకు అనుకూలంగా చూపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఈసారి జరిగేవి ఎన్నికలు కావు కురుక్షేత్ర యుద్ధమే దానిలో తాను పద్మవ్యూహం చెందించబోయే అర్జునుడినని గొప్పగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి, తమ పార్టీ కార్యకర్తలకు, కౌంటింగ్ ఏజంట్లను ఉద్దేశ్యించి, “ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ… ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. అంటే కౌంటింగ్‌లో కూడా చొక్కా మడత పెట్టి యుద్ధం చేసి వైసీపిని గెలిపించమని సూచిస్తున్నట్లు అర్దమవుతోంది.
ఓ వైపు ఓటమి కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నయ జగన్, సాక్షి మీడియా తీరు మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః చివరి ఓటు లెక్కించే వరకు కూడా మేమే గెలుస్తామని ఆత్మవంచన చేసుకుంటూ ప్రజలను కూడా మభ్యపెట్టాలనుకోవడం వైసీపికి మాత్రమే సాధ్యమేనేమో?






