కోర్టులు కూడా ఇలా చేస్తే ఎలా?

Andhra Pradesh High Court తిరుపతి ఉపఎన్నికలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని లోకమంతా కోడై కూసింది. పక్క ఊర్ల నుండి జనాలను తరలించి ఓట్లు వేయిస్తున్నట్టుగా లైవ్ లో చూపించాయి కొన్ని టీవీ ఛానళ్ళు. క్యూ లైన్ లలో ఓట్లు వెయ్యబోతున్నవారు తమ ఓటర్ గుర్తింపు కార్డు మీద ఉన్న తమ పేర్లు, తమ తండ్రి/భర్త పేర్లు కూడా చెప్పలేకపోవడంతో భారీ ఎత్తున దొంగ ఓట్లు పడ్డాయని బయటపడింది.

అంత జరిగినా ఎన్నికల కమిషన్ కూడానా పట్టించుకోకపోవడంతో ఉప ఎన్నిక రద్దు చేయాలని హై కోర్టులో పిటిషన్లు వేశాయి టీడీపీ, బీజేపీ పార్టీలు. రెండు పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది. ఫలితాలు రావడానికి ఇంక కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేం అని కోర్టు తేల్చి చెప్పింది.

ADVERTISEMENT

అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. “కళ్ళ ఎదురుగా రుజువులు ఉన్నాయి. కోర్టు కనీసం విచారించి అక్రమాలు జరిగాయనో జరగలేదనో తేల్చి చెప్పాల్సింది. అయితే ఈ దశలో తాము జోక్యం చేసుకోలేం అంటే ఏం మెస్సేజ్ ఇచ్చినట్టు? కోర్టులు కూడా ఇలాంటివి చూసి ఊరుకుంటే ఎలా?,” అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు… తిరుపతి ఉపఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్నికల రోజు జరిగిన తంతు కారణంగా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి ఎక్కడా కనిపించడం లేదు.ప్రజాస్వామ్యవాదులు మాత్రం ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? అంటూ నిట్టూరుస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories